భారీగా F2 ప్రీ రిలీజ్ బిజినెస్!

F2 Pre Release Bussinessవెంకటేష్ ,వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘F2’.ఈ సినిమా ప్రపంచవ్యాప్తముగా రేపు విడుదల కాబోతుంది.ఈ సినిమాను దిల్ రాజు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంతోనే నిర్మించాడు.

వెంకీ మామ అందరివాడు – అంతే గా..అంతే గా !

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి.ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లకు ఈ సినిమా అమ్ముడు పోవడం విశేషమనే చెప్పాలి.నిజానికి వరుణ్ – వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా కూడా ఇదేనట.

ఈ సినిమాను దిల్ రాజు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లే తీసుకున్నారని, అది కూడా దాదాపు అడ్వాన్సు బేసిస్ లోనే ఈ సినిమా హక్కులను తీసుకున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు.కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement