పవన్ గుట్టు బయటపెట్టిన ఎం రాఘవరావు!

Fans Fires on Pawanసినీ నటులకు అభిమాన ధనమే పెట్టుబడి.ఆ విధంగా సినీనటులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ నటుడు అభిమానులను సమాదరించ‌కపోయినా, అతని తీరు నచ్చకపోఅయినా నిజ జీవితంలో ఆ హీరో మీదనే అభిమాని ఫైర్ అవుతాడు.

మొన్న పోసాని.. నిన్న చిన్నిక్రిష్ణ.. నేడు ఎవరో?

ఇప్పుడు విశాఖలో అదే జరిగింది. ఆయన ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యస్ఖుడు, పైగా బ్లడ్ బాంక్ అధ్యక్షుడు. ఎన్నో కార్యక్రమాలు చిరంజీవి తరఫున చేశారు.

ప్రజారాజ్యం ఏర్పాటులో కీలక‌మైన పాత్ర పోషించారు. అలాగే జనసేనలోనూ చురుకైన భూమిక నిర్వహించారు. అటువంటి మెగా ఫ్యాన్ ఎం రాఘవరావు అనూహ్యంగా వైసీపీలో చేరారు.

ఆయన జనసేన‌ విధానాలకు విసిగి వైసీపీ వైపుగా వచ్చారు. టీడీపీ, జనసేన మధ్యన సంబంధాలను బాహాటంగా బయట పెట్టారు. టీడీపీతో, సీఎం చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు.

ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్న పవన్‌ విధానాలు నచ్చకే జనసేన నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అభిమానులను పవన్‌ ఘోరంగా మోసం చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.