స్టార్స్ సీక్రెట్స్ బయటపెడతాను అంటున్న మంచు లక్ష్మి

“ఊట్‌”  అనే  యాప్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫార్మ్  లో “ఫీట్ అప్ విత్ ద స్టార్ట్స్ తెలుగు “షో తో సెప్టెంబర్ 23 నుండి కలర్స్ తెలుగు అనే బ్రాండ్ తో ప్రేక్షకులను అలరించనుంది . ఈ షో గురించి లక్ష్మి  మనోభావాలను మీ కోసం .

మొదటిసారి ఇలాంటి షో తెలుగు లో రావటం అది ప్రముఖ తారల తో లక్ష్మి మాత్రమే చేయగలదు అనే విధంగా షో ని నడిపించబోతుంది. బాలీవుడ్ లో ఇలాంటి షోస్ నార్మల్ గానే ఫీల్ అవుతారు ,వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా ఫ్రీ గా మాట్లాడుతారు ,కానీ మన తెలుగు సినిమా రంగం లో సినిమాల్లో హీరో లాగానే నిజజీవితం లో కూడా హీరో లాగావుంటాలి అని  అనుకుంటారు .పర్సనల్ లైఫ్ లో ని సీక్రెట్స్ ని బయటకు తీసే ప్రయత్నమే ఈ షో .

click here for Feet Up with the Stars Promo

బెడ్ మీద తారల తో షో అంటే కొంచము ఆలోచించాను కానీ షో కి వచ్చిన స్టార్ట్స్ అందరు చాల కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు . షో కూడ ఎక్కడో కాకుండా మా ఇంటిలోనే షూటింగ్ బెడ్ సెట్ వేశాము ,మా ఇల్లు ఎంతో మంది ప్రముఖ తారలు నడిచిన ఇల్లు ,నాకు దేవాలయం తో సమానము అది కాకుండా ఫ్రీ కదా .

అన్ని ఇంటర్వూస్ లాగ అడిగిన ప్రేశ్న లే కాకుండా కొంచం వైవిధ్యంగా మనసులోని సీక్రెట్స్ ని బయటకు తీసుకొని వచ్చే విధంగా ,వారికీ నాకు ఉన్న సాన్నిహిత్యం ద్వారా షో  కి వచ్చేవారిని నైట్ డ్రెస్ లో నే రావాలి అని కోరాము .ఈ షో వలన ఎవరి ఇమేజ్ మారదు .ఇట్స్ ఏ సింపుల్ ఫన్ ,హర్ట్ వార్మింగ్ షో . ఫీట్  అప్ అంటేనే కొంచం దగ్గరగా కంఫర్ట్ గా ఉండటమే . ఇంతకు ముందు మనకి తెలియని సీక్రెట్స్ ని తెలుసుకోవటమే ఈ షో ,అందరి సీక్రెట్స్ ని బయటకి తీయబోతున్నాము