గోంగూర చికెన్ కర్రీ

సాధారణంగా చికెన్ తో చాలా రకాలైన వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటాం. ఐతే ఆంధ్రా చికెన్ వంటకాలలో గోంగూర చికెన్ కి చాలా ప్రత్యేకత ఉంది .గోంగూర చికెన్ కర్రీకి ఉండే రుచే వేరు.
మామూలుగా చికెన్ మన శరీరం లో వివిధ అవయవాలు పెరుగుదలకు మరియు అభివృద్ధి కొరకు ,ఉపయోగపడటమేగాక ప్రోటీన్స్ అందించటం లో సహాయపడుతుంది .
ఇంతటి రుచికరమైన గోంగూర చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

పాలకూర ఆమ్లెట్

Gongura Chicken Curry

కావలసిన పదార్థాలు;

చికెన్‌ – 300 గ్రా
గోంగూర – 1 కప్పు
గరం మసాలా – 1/4 టీ స్పూను
కరివేపాకు – 2 రెమ్మలు
జీలకర్ర – చిటికెడు
నూనె – 1 టీ స్పూను
నెయ్యి – చికెన్‌ వేయించటానికి సరిపడా
ఉల్లి ముద్ద – 1/2 కప్పు
నిమ్మరసం – 1/2 టీ స్పూను
నెయ్యి – 1 టీ స్పూను
ఉప్పు – తగినంత
కారం – 1 టీ స్పూను
ధనియాల పొడి – 1/4 టీ స్పూను
అల్లంవెల్లుల్లి ముద్ద – 1 టీ స్పూను
పచ్చిమిర్చి – 4

తయారీ విధానం;

ముందుగా ఒక గిన్నెలో చికెన్‌ తీసుకొని అందులో ఉల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు ,కారం , ధనియాల పొడి, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని అర గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
బాండీలో 1 టీ స్పూన్‌ నూనె వేసి వేడైన తరువాత గోంగూర వేసి ఉడికేదాకా వేయించుకోవాలి. ఉడికిన గోంగూరకు పచ్చిమిర్చి చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
తరువాత బాండీలో నెయ్యి వేసి జీలకర్ర కరివేపాకు, వేసి వేయించుకొని అందులో చికెన్ మిశ్రమాన్ని మరియు కొద్దిగా
గరం మసాలా వేసి పొడిగా తయారయ్యే వరకూ వేయించాలి.తరువాత గోంగూర ముద్దను కూడా వేసి చికెన్‌ ముక్కలకి బాగా పట్టి ,పొడిగా తయారయ్యే వరకూ వేయించుకోవాలి.
ఏమాత్రం తడిలేకుండా పొడి పొడిగా తయారయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ రెడీ .

Advertisement