గోంగూర మటన్ కర్రీ

గోంగూర మటన్ కర్రీ ఒక ప్రసిద్ధ ఆంధ్రా వంటకం.నిజానికి గోంగూర మటన్ కర్రీ సాధారణ మటన్ కూరల కంటే చాలా రుచిగా ఉంటుంది.
ఇంతటి రుచికరమైన గోంగూర మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఎగ్ సమోసా

Gongura Mutton

కావలసిన పదార్థాలు:

మటన్‌- 1/2 కిలో,
గోంగూర- 3 కట్టలు,
తరిగిన పచ్చిమిర్చి- 6,
పసుపు- 1 టీ స్పూను,
అల్లంవెల్లుల్లి ముద్ద- 1 టీ స్పూను,
గరం మసాలా- 1 టీ స్పూను,
తరిగిన ఉల్లిపాయ- 1 ,
నూనె- 3 టీ స్పూనులు,
కారం- 2 టీ స్పూన్లు,
ధనియాల పొడి- 1 టీ స్పూను,
జీలకర్ర పొడి- 1/2 టీ స్పూను,
ఉప్పు- తగినంత.

తయారీ విధానం:

కుక్కర్‌లో మటన్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి.
తర్వాత బాండీలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు , గరం మసాలా వేసి ఒక నిమిషం సేపు వేయించుకోవాలి.
అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి.
ఆ తర్వాత ఉడికిన మటన్‌ మరియు తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.
చాలా రుచికరంగా ఉండే గోంగూర మటన్ తయారైనట్టే .

Advertisement