హలో గురు ప్రేమ కోసమే రివ్యూ : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

రామ్-అనుపమ “హలో గురు ప్రేమ కోసమే” అంటూ ఈ దసరా కి సందడి చేయడానికి థియేటర్స్ లోకి వచ్చేశారు. మరి ఈ చిత్రం కథా ,కమామీషు ఏంటో చూద్దాం పదండి.

హలో గురు ప్రేమ కోసమే రివ్యూ:3.0/5.0

Hello Guru Prema Kosame Review in English

చిత్రం : హలో గురు ప్రేమ కోసమే
తారాగణం : రామ్ ,అనుపమ ,ప్రణీత ,ప్రకాష్ రాజ్ ,ఆమని ,సితార ,పోసాని మరియు ప్రవీణ్
దర్శకుడు : త్రినాథ రావు నక్కిన
నిర్మాత : దిల్ రాజు ,శిరీష్ -లక్ష్మణ్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
మ్యూజిక్ : డీఎస్పీ

కథ : సంజు (రామ్ ) ఉద్యోగం లేని కాకినాడ కుర్రాడు.హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం వెతుక్కోమని చుట్టాలంతా కలిసి తరిమితే బయల్దేరతాడు.
వెళ్తూ వెళ్తూ ,అను (అనుపమ)ను ట్రైన్ లో కలుస్తాడు. అలాగే పని చేసే ఆఫీస్ లో ప్రణీత ను కలుస్తాడు.

ఈ ముగ్గురి ప్రయాణం ప్రేమ బాట లో వెళ్తుండగా., రామ్ కు అనుపమ తండ్రి ప్రకాష్ రాజ్ తో వున్న సంబంధం తెలుస్తుంది. అదేంటి ? వీళ్ళ ముగ్గురి ప్రేమ కథ ఎక్కడ తేలుతుంది అనేది “హలో గురు ప్రేమ కోసమే ” సారాంశం.

విశ్లేషణ :

కథ చాలా సార్లు చెప్పుకున్న ,చూసేసిన ప్రేమ కథే అయినా , ఆద్యంతం నవ్వులతో,ప్రధాన పాత్ర దారుల చక్కని నటన తో,ఆసక్తి కర మలుపులతో హలో గురు బాగానే ఉంది.

సరదా అయిన యువకుడు , ఒక అందమైన అమ్మాయి ,అమ్మాయి తండ్రి సహాయం తోనే అమ్మాయి ప్రేమ ను 30 రోజుల్లో గెలవడం !! ఇది క్లుప్తం గా హలో గురు ప్రేమ కోసమే కథ. పెద్ద పెద్ద మెసేజ్ లు ఏమి లేకుండా సింపుల్ సాగే ప్రేమ కథ!! చివర్లో మెలో డ్రామా కొద్దిగా ఎక్కువైందనిపించినా., ఆ మాత్రం కూడా లేకుంటే హీరోయిన్ ఊరికే పడిపోయింది అన్నట్లుండేదేమో!!

ఎక్కువగా ఏమి ఆశించకుండా ., కాసిన్ని నవ్వులు ,కాసంత సరదా కోసం అయితే “హలో గురు ప్రేమ కోసమే ” మీ కోసమే !! పండగ రోజు అంతకు మించి ఏం కావాలి చెప్పండి.

నటీనటుల విషయానికి వస్తే ., రామ్ చాలా సినిమాల్లో చేసేసిన “సాధారణ కుర్రాడి ” పాత్ర లో మరోసారి కనిపించాడు.అలరించాడు కూడా !! అతని కామెడీ టైమింగ్ , సునాయాసంగా చెప్పే డైలాగ్స్ ఇట్టే ఆకట్టుకుంటాయి.

Hello Guru Prema Kosame Review in English

అనుపమ అందం గా, కొంటెగా ., కొంచెం మొండి గా మంచి పాత్రే చేసింది. ఆమె హావభావాలు బావున్నాయి. ప్రణీత చిన్న పాత్ర చేసింది., రామ్ ఆఫీస్ కొలీగ్ లాగా !! ఉన్నంతలో ఆమె బావుంది., బాగా చేసింది !! ప్రధానం గా కామెడీ చుట్టూనే తిరిగే ఈ సినిమాలో అన్ని పాత్ర లు దానికోసమే ఉన్నాయి.

ఇక నాగినీడు -సితార ,ప్రకాష్ రాజ్ -ఆమని హీరో,హీరోయిన్ల తల్లి దండ్రులుగా నటించారు. ప్రకాష్ రాజ్ చాలా రోజుల తర్వాత తెలుగు స్క్రీన్ మీద ముఖ్య పాత్ర లో కనిపించాడు.సప్తగిరి ,ప్రవీణ్ సహాయ పాత్రల్లో అలవాటయిన కామెడీ చేశారు.

ఇక పాటలు ,సంగీతం మేజిక్ ఈ సినిమాకి పని చేయలేదు . ఇంతకు ముందు నేను శైలజ ,నేను లోకల్ సినిమాలని తన మ్యూజిక్ తోనే హిట్ చేసేసిన డీఎస్పీ ఈ సారి అంత ప్రభావం చూపలేకపోయాడు. 

ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కథ కు తగ్గట్లే వున్నా ., ఒక్కోసారి ఇంకొంచెం బావుండొచ్చేమో అనిపించింది. మొత్తానికి పర్లేదు .

త్రినాథ రావు దర్శకత్వం లో బలం “సింప్లిసిటీ “. ఈ సినిమాకి కూడా అదే నమ్ముకున్నాడు .కథ కంటే కథనం ఆసక్తికరం గా రాసుకున్నాడు . చివర్లో సన్నివేశాలు కొంచెం బలవంతం గా వున్నా ., మొత్తానికి “హలో గురు ప్రేమ కోసమే” నిరాశ పరచదు.

Hello Guru Prema Kosame Review in English

ఒక్క మాటలో చెప్పాలంటే ., హలో గురు సరదా అయిన సినిమా!! ఒకసారి చూసేయ్యొచ్చు ఆడుతూ పాడుతూ ., ఆలోచనలన్నీటికీ తాళం పెట్టేసి !!

చివరి మాట : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

Advertisement