వయొలెన్స్‌ చూపిస్తా……ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా.. నాని !

 

 

Natural Star Nani Ugadi Movie

వయొలెన్స్‌ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా గన్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అని విలియం షేక్‌స్పియర్ కోట్స్‌ను ఉంచారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది ఉగాది కానుగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు సమాచారం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మరో హీరో సుధీర్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.