హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ కారుకు ప్రమాదం

Hero rajasekhar car accident

రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నన్ను గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను . అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేద’ ని అన్నారు.అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు