కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విజయ్ ‘విజిల్’ ……. (బిగిల్)

vijay|tamil hero vijay| vijay whistle movie
 

తమిళ స్టార్ హీరో విజయ్ ‘విజిల్’ (బిగిల్) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మంచి హిట్ టాక్ రావడంతో తిరుగులేని కలెక్షన్లను సాధిస్తోంది. మెర్సల్,తెరి వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తరువాత అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రం తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. మాస్ ఆడియన్స్ మెప్పిస్తూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన నాలుగురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మార్క్ దాటి.. రెండొందల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకువెళ్తోంది. ఒక్క ఇండియాలోనే రూ. 97. 68 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు విజయ్.నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ భారీఎత్తున నిర్మించింది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు . పూర్తిగాకమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది