టీ20లో బంగ్లాదేశ్‌ తొలి విజయం …..చేజేతులా ఓడిన భారత్

 

india vs bangladesh first T20 match
india vs bangladesh first T20 match

బంగ్లాదేశ్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో 8×4, 1×6) అజేయ అర్ధశతకం బాదడంతో భారత్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. టీ20 చరిత్రలో టీమిండియాపై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి. తాజా గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యం సాధించగా.. రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

గెలుపు కోసం బంగ్లా చివరి 18 బంతుల్లో 35 పరుగులు చేయాలి. వికెట్లు చేతిలో ఉన్నా ఒత్తిడిలో అది అంత సులువు కాదు. అయితే 18వ ఓవర్లో ముష్ఫికర్‌ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద కృనాల్‌ నేలపాలు చేసి వారికి మరో అవకాశం ఇచ్చాడు. ఖలీల్‌ వేసిన 19వ ఓవర్లో ముష్ఫికర్‌ చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 4, 4 బాది గెలుపునకు చేరువగా తీసుకొచ్చాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) షఫీయుల్‌ 9; ధావన్‌ (రనౌట్‌) 41; రాహుల్‌ (సి) మహ్మదుల్లా (బి) అమీనుల్‌ 15; అయ్యర్‌ (సి) నయీమ్‌ (బి) అమీనుల్‌ 22; పంత్‌ (సి) నయీమ్‌ (బి) షఫీయుల్‌ 27; దూబే (సి అండ్‌ బి) అఫీఫ్‌ 1; కృనాల్‌ (నాటౌట్‌) 15; సుందర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 4;
మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1–10, 2–36, 3–70, 4–95, 5–102, 6–120.
బౌలింగ్‌: షఫీయుల్‌ 4–0–36–2, అమీన్‌ 4–0–27–0, ముస్తఫిజుర్‌ 2–0–15–0, అమీనుల్‌ 3–0– 22–2, సర్కార్‌ 2–0–16–0, అఫీఫ్‌ 3–0– 11–1, మొసద్దిక్‌ 1–0–8–0, మహ్మదుల్లా 1–0–10–0.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) రాహుల్‌ (బి) చహర్‌ 7; నయీమ్‌ (సి) ధావన్‌ (బి) చహల్‌ 26; సౌమ్య సర్కార్‌ (బి) ఖలీల్‌ 39; ముష్ఫికర్‌ (నాటౌట్‌) 60; మహ్ముదుల్లా (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 7;
మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–8, 2–54, 3–114.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–24–1, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–25–0, ఖలీల్‌ అహ్మద్‌ 4–0–37–1, యజువేంద్ర చహల్‌ 4–0–24–1, కృనాల్‌ పాండ్యా 4–0–32–0, దూబే 0.3–0–9–0.