ఇంటిలిజెంట్‌ ట్రైలర్ :పక్కా మాస్ సినిమా !

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే పక్కా మాస్ సినిమాలా ‘ఇంటిలిజెంట్‌’ ఉండబోతుందనేది ట్రైలర్ చూసిన తర్వాత తెలుస్తుంది. మాస్ డైరెక్టర్, మాస్ హీరో కాంబినేషన్‌లో పక్కా మాస్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లుగా ట్రైలర్ తేల్చేసింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీకి పెద్ద పీట వేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి పాటతో, డ్యాన్స్‌లతో చిరుని చూపించిన సాయి.. ట్రైలర్‌లో పవన్ కల్యాణ్‌ని ఇమిటేట్ చేస్తూ.. సాయి ఈ ట్రైలర్‌లో అదరగొట్టేశాడు. ఇక ఫిబ్రవరి 9 మెగా ఫ్యాన్స్‌కి పండగే.

Advertisement