పులివెందుల‌లో సంచ‌ల‌నం: ఏకంగా జగన్‌ ఓటుకే ఎసరు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వార్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అధికార, ప్ర‌తిప‌క్షాలు వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. కొద్దిరోజుల ముందు ఓట్ల గ‌ల్లంతు వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ ప్రభుత్వ క్యాష్ ఫర్ ట్వీట్‌:కేటీఆర్‌

వైసీపీ వ‌ర్గాల ఓట్ల‌న్నీ టీడీపీ ప్రభుత్వమే చేస్తుందని వైసీపీ నేత‌లు ఫిర్యాదులు చేయ‌డంతో,
ఏకంగా డేటా చోరీ కేసు తెర‌పైకి వ‌చ్చి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది.అయితే ఇప్పుడు
టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టింది.

తాజాగా ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుండి, జ‌గ‌న్ ఓటు తొల‌గించ‌మంటూ వ‌చ్చిన ద‌ర‌ఖాస్తు ఇప్పుడు సంచ‌ల‌నం సృస్టిస్తోంది.దీంతో వెంట‌నే జ‌గ‌న్ బంధువులు పులివెందుల త‌హ‌సిల్దార్‌కు ఫిర్యాదు చేయ‌డంతో, విచార‌ణకు దిగార‌ని తెలుస్తోంది.

ఒక మొబైల్‌ నుంచి ఈ దరఖాస్తు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు.టీడీపీ- వైసీపీ శ్రేణులు ఆరోప‌ణ‌లు చేస్తుకుంటున్న నేప‌ధ్యంలో, ఏకంగా జ‌గ‌న్ ఓటుకే ఎసరు పెట్ట‌డం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement