బాబు పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఐవైఆర్…

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రధాని మోడీయే కారణం అని అర్థం వచ్చేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోదీకి ఆయన పోటీ రాదట !

మోడీ ఏ అరాచకానికైనా పాల్పడతాడని, గోద్రాలో రెండువేల మందిని బలి తీసుకున్న నరమేధాన్ని ఇంకా ఎవరు మర్చిపోలేదని, ప్రపంచ ఆర్థిక సదస్సుకు కూడా మోడీని అనుమతించలేదని చంద్రబాబు హితవు పలికారు.అయితే బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.

ఈ వ్యాఖ్యలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.సీఆర్పీఎఫ్ దాడిలో పాక్ వైఖరిని ఖండించాల్సింది పోయి, మోడీ రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నారని అనటం బాబు దిగజారుడు తనానికి నిదర్శనం అని అంటున్నారు.