నాయకులందు ‘జగన్నా’యకుడు వేరయా!

ఎన్నికలకు ముందు ,తర్వాత ఎప్పుడైనా కూడా ఒకే మాట మీద ఉండి , ఏ బలహీనతలు తలొగ్గకుండా ఉండడమనేది చాలా కష్టం ! వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ సబ్జెక్టు లో నిష్ణాతుడే అనుకోవాలి. సమకాలీన రాజకీయాల్లో అలా ఉండడం ఒక ప్రత్యేక మైన విషయం గా కూడా చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక జనాలు నాయకుల కదలికల్ని బూతద్దం లో చూస్తూ కడిగి పారేస్తున్నారు.

సీఎం చంద్రబాబు నే తీసుకుందాం. కాసేపు మూడో కూటమి అంటారు , ఇంకాసేపు కాంగ్రెస్ తో కలిసి రాహుల్ ని ప్రధాని చేస్తా అంటారు. మరికాసేపాగి నేనే చక్రం తిప్పేసి ఆ చక్రం లో నేనే ప్రధాని గా కూర్చుంటా అంటారు.

జగన్ తొందరపడి కేంద్రం లో ఈ పార్టీ కి మద్దతివ్వలేదు .ఎవ్వర్నీ తిట్టలేదు .., పొగడ లేదు. అందుకే రేపు ఎవరొచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దిశగానే తన అడుగులు ఉంటాయని ప్రజలకు స్పష్టం గా చెప్పారు. ఇక బాబు ,పవన్ గాలి వాటు కు పోయే రకాలు !! పవన్ అయితే మాయావతి కి ఎందుకు సపోర్ట్ ఇచ్చారో ఆయనకే తెలియాలి.

ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ కి అనుకూలం గా చెప్పిన నేపథ్యం లో బాబు కక్కలేక ,మింగలేక చస్తున్నాడు. ఇక వైసీపీ గెలిచినా ,ఓడినా పోయేదేమీ లేదు . ఎందుకంటే వాళ్ళు కోరి ఎవరితో వైరం తెచ్చుకోలేదు. ఏ సెంట్రల్ పార్టీ మీద బురద చల్లలేదు.

ఇక రాష్ట్రానికి కావల్సినివని ఎలా ఇస్తారు అంటే చట్ట ప్రకారం జరిపే పోరాటం తోనే !అలా కాదు ..బీజేపీ ఆంధ్ర కి ఏమి ఇవ్వదు అంటే .. అలా చేస్తే ఆ పనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా జగన్ కల్పించగలడు. తొమ్మిదేళ్ల క్రితం ఆర్థిక నేరగాడు , ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి లో ఎలా ఉన్నాడో .. అచ్చు అలాగే !!

Ys Jagan election campaign schedule