ఆ విషయంలో ఎన్టీఆర్ తో పోల్చుకున్నా జగన్!

Jagan about NTRవైసీపీ అధినేత వైఎస్ జగన్ తనను తాను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తో పోల్చుకున్నారు. అదేంటి జగన్ పోల్చుకుంటే వైఎస్సార్ తో పోల్చుకోవాలి కానీ, ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడితో పోల్చుకోవడమేంటి అనుకుంటున్నారా,అక్కడే ఉంది అసలు విషయం.

జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా?

జగన్ తనతో భేటీ అయిన తటస్తులతో మాట్లాడుతూ, పెన్షన్లే కాదు, ఇతర అంశాల్లోనూ చంద్రబాబు ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా అంటూ చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.

గతంలో ఎన్టీఆర్‌గారు 2 రూపాయలకు కిలోబియ్యం ఇస్తానంటే, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి గారు 1.90 పైసలకు ఇస్తానని, ఎన్నికలకు 6 నెలల ముందు ప్రకటించారని జగన్ గుర్తు చేశారు.

అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసినట్టుగానే చంద్రబాబు కూడా చేస్తున్నారని విమర్శించారు. కానీ అప్పట్లో జనం ఎన్టీఆర్‌ కే పట్టం కట్టిన విషయం మరచిపోకూడదని జగన్ గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు అర్థం అయ్యింది కదా, చంద్రబాబును కోట్ల విజయభాస్కర్ రెడ్డితో పోల్చిన జగన్, తనను మాత్రం ఎన్టీఆర్ తో ఎందుకు పోల్చుకున్నాడో. అంతే కాదు చంద్రబాబును పరీక్షలు కాపీ కొట్టే స్టూడెంట్‌ తో పోల్చి మొత్తం పరువు తీసేశాడు.

Advertisement