వైసీపీ తొలి మంత్రి అతనేనట!

Jagan Announcementవైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలను ,ఎంపీలను ప్రకటించడం నామినేషన్లు వేయడం జరిగిపోయింది.నిన్న జరిగిన చిలకలూరిపేట బహిరంగ సభలో తొలి మంత్రిని జగన్ ప్రకటించారు. చిలకలూరిపేటను గెలిపించండి రాజశేఖర్‌ ను మంత్రిని చేస్తానని ప్రజల మధ్య హామీ ఇచ్చారు.

బాబుకు అర్థమయిపోయిందా?

అసలు విషయం ఏమిటంటే,సామాజిక న్యాయం కోసం బీసీల కోసం సీటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, రాజశేఖర్ ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు వచ్చారని, చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే టికెట్, మహిళా ఎన్నారై రజనీ కుమారికి ఇచ్చారని జగన్ ప్రశంసించారు.

ఇలా పార్టీ కోసం త్యాగం చేసిన రాజశేఖర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటానని జగన్ చెప్పడం విశేషం.అలాగే జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తులను జగన్ ప్రజలకు పరిచయం చేశారు.

ఈ ప్రకటనతో జగన్ ఏంటో అందరికి అర్థమైందని చెప్పొచ్చు.తనని తన పార్టీని నమ్ముకున్న నేతలకు తప్పకుండా న్యాయం చేసి తీరుతారని తెలుస్తుంది.