నా ప్రెస్ మీట్ కి ఆంధ్రజ్యోతి రావొద్దు:వైయస్ జగన్

Jagan avoids Yellow Channelsఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్ పలు సభల్లో మాట్లాడుతూ,మనం తెలుగుదేశం నేతలతోనే కాదు, ఈ ఎల్లో మీడియాతో కూడా పోరాడాలి అంటూ తన కార్యకర్తలకు చెబుతున్నారు.

‘అన్న వస్తున్నాడు’ అంటూ జనంలోకి జగన్!

 

అంతేకాదు ఇప్పుడు ఆయన చెబుతున్న ఎల్లో మీడియా బ్యాచులో కొత్త ఛానల్‌ ను చేర్చారు.ఎన్నికలు దగ్గరబడే కొద్ది పాలకులుగా ఉన్నవారి అరాచకాలు పెచ్చు మీరుతున్నాయని జగన్ అన్నారు.

చంద్రబాబు ఆడే డ్రామాలు అన్ని ఇన్ని కాదు, చంద్రబాబు అక్రమాలకు అండగా ఉంటున్న ఎల్లో మీడియా ఎవరో క్లారిటీ ఇచ్చారు.ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి5 ఛానళ్లు అంటూ జగన్ తన వైసీపీ సైన్యానికి సూచనలు చేశారు.

ఈ మధ్య జగన్ ప్రెస్ మీట్ లకు ఆంధ్రజ్యోతిని రావొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆ ఛానెల్ టీడీపీ అక్రమాలకు గొడుగు పడుతూ వస్తుంది.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో మీడియా కొన్ని పార్టీలకు అనుకూలంగా మారిన సంగతి తెలిసిందే. నిష్పాక్షికంగా వార్తలు ఇచ్చే మీడియాలు చాలా అరుదుగానే ఉన్నాయి. ప్రత్యేకించి ప్రముఖమైన పత్రికలు, ఛానళ్లు ఏదో ఒక స్టాండ్ తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి.

Advertisement