పచ్చ తమ్ముళ్ల ఆశలను ఆవిరి చేసిన జగన్!

Jagan Effect on TDPఏపీలో 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికలు దేశం ద్రుష్టిని బాగా ఆకట్టుకుంటున్నాయి. అప్పట్లో జగన్, చంద్రబాబు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నవారే. అందువల్ల ఓటరుకు అనుభవం కార్డ్ చెప్పి బాబు నెగ్గుకొచ్చారు.

చంద్రబాబు లాంటి చేతకాని వ్యక్తి సీఎం అయితే..

 

మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు జగన్ నవరత్నాలను కాపీ కొట్టి ,ఆయన అమలు పరుస్తున్నాడు.తాజాగా పించన్ల పండుగ అంటూ రెట్టించిన మొత్తంతో వ్రుధ్ధులు సంబరాలు చేసుకున్నారో లేదో తెలియదు కానీ, పసుపు తమ్ముళ్ళు మాత్రం మళ్ళీ మాదే అధికారం అనుకుంటూ ఊహాలోకంలో తేలిపోయారు.

మేము పించను ఇస్తున్నాం, మాకే ఓటేయండి అంటూ ఆర్డర్లు వేసే స్థాయిలో తమ్ముళ్ళు చెలరేగిపోయారు. ఒకానొక మంత్రి గారు అయితే మా పించన్లు పధకాలు దొబ్బి అంటూ ఏదేదో మాట్లాడేశారు.

ఆ ఆనందం ఆవిరయ్యేలా తిరుపతిలో జగన్ మీటింగ్ జరిగింది. జగన్ ఒకే ఒక్క మాటతో మొత్తం హుష్ కాకీ అనిపించేశారు. రెండు వేల పించను బాబు ఇస్తే తీసుకోండి. రెండు నెలలు పోయాక ఎటూ మన ప్రభుత్వం వస్తుంది, మూడు వేల పించన్లు తాను ఇస్తానంటూ ఇచ్చిన హామీతో, టీడీపీ నేతలకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.

Advertisement