అట్టర్ ప్లాప్ అయిన బాబు సినిమా

వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా విడుదల చేసిన ఆరో బడ్జెట్ అనే కొత్త సినిమా చాలా దారుణంగా ప్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు జగన్.

చంద్ర బాబుని వదలని వర్మ 

పేరుకు బడ్జెట్ తయారు చేపించి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందామని చూశారు కానీ, అది చాలా డివైడ్ టాక్ తెచ్చుకుందని జగన్ అన్నారు.తల్లికి అన్నం పెట్టనివాడు…చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఆలా ఉంది చంద్రబాబు పరిస్థితి అని జగన్ ఎద్దేవా చేశారు.

ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత అంత కూడా తానే తీసుకోని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శంకుస్థాపన చేసి, మరో ముడేళ్ళల్లో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తీ చేస్తామని జగన్ స్పష్టం చేశారు.

నాలుగున్నరేళ్లుగా చేయని పథకాలు, పనులు కేవలం ఈ మూడు నెలల్లో చేస్తామంటే నమ్మడానికి ప్రజలేం కాలిగా లేరని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా అధినేత జగన్ విరుచుకపడ్డాడు. 

Advertisement