జగన్ గృహప్రవేశం వాయిదా అందుకేనట!

Jagan New Houseగతంలో జగన్ నివాసం హైదరాబాదులో ఉండటంతో, పార్టీకి చెందిన చాలామంది నాయకులు కార్యకర్తలు, ఏదైనా విషయం చెబుదామంటే కొంత కష్టంగా ఉండేది.

జగన్ సత్తా ఏంటో., కాంగ్రెస్ కి ఇప్పుడు తెలిసిందట!

దీంతో జగన్ తన నివాసాన్ని రాజధాని ప్రాంతానికి మార్చుకోబోతున్నాడు. ఈ నిర్ణయంతో వైసీపీ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు.

తాడేపల్లి లో జగన్ నూతనంగా కట్టించుకుంటున్న గృహంలో, ఈనెల 14వ తేదీన గృహప్రవేశం చేస్తున్నట్లు, ఇటీవల తెలుగు మీడియా మరియు వైసీపీ పార్టీ కి చెందిన కొంతమంది నేతలు ప్రకటనలు చేశారు.

ఇప్పటికే జగన్ నూతన గృహము మరియు పార్టీ కార్యాలయం నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది. అయితే గృహప్రవేశం చేయాల్సిన నేపథ్యంలో పార్టీ నేత‌లు అంద‌రూ హాజ‌రుకావాల్సిందిగా ఆహ్వానాలు కూడా పంపించారు.

ప్రస్తుతం ఈ కార్య‌క్ర‌మం తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం. జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌, బావ అనీల్ అనారోగ్యంతో ఉండ‌టంతో గృహ‌ప్ర‌వేశ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారట.

Advertisement