‘అన్న వస్తున్నాడు’ అంటూ జనంలోకి జగన్!

Jagan New Politicsజగన్ పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో, అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైందని అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.

రాటుతేలిన జగన్ రాజకీయం.. యుద్దానికి సిద్ధమా?

ముఖ్యంగా జగన్ పాదయాత్ర మొదలు పెట్టక ముందు, కూటమిగా ఉన్న బీజేపీ -జనసేన -టీడీపీ పార్టీలు, జగన్ వేసిన ప్రతి అడుగుకి కూటమి కోటలు కూలిపోయి మూడుగా చీలి పోయాయి.

ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతిని, వారి వారి నియోజకవర్గాలలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో జగన్ అద్భుతంగా ప్రసంగించారు.

పాదయాత్ర ముగిశాక జగన్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభల్లో మరో సరికొత్త నినాదాన్ని అందుకున్నారు.

రాబోయే రోజుల్లో ‘అన్న వస్తున్నాడు’ అంటూ, ప్రతి ఒక్కరు చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయిన వారికి తెలియ చేయాలని వైసిపి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా సామాన్యులకు ధైర్యాన్ని ఇచ్చేలా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేయాలని, ‘అన్న వస్తున్నాడు’ అన్న నినాదాన్ని ప్రజలకు నమ్మకం కలిగించేలా తెలియజెప్పాలని కోరారు.

Advertisement