పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకే:జగన్

Jagan Planing14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్, తన పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాలను చుట్టి రావాలని నిర్ణయించుకున్నారు.ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రచించుకున్న జగన్ ,అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.

వైసీపీ లోకి మరో సీనియర్ కాంగ్రెస్ నేత?

భేటీలు జిల్లాల వారీగానే జరుగుతున్నా, జగన్ మాత్రం ఆ జిల్లాల్లోని వేర్వేరు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో వేర్వేరుగానే భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.ఈ భేటీలకు సంబంధించిన కార్యాచరణ కూడా పూర్తి అయినట్టు సమాచారం.

అమరావతిలోని ఇంటిలో చేరిన తర్వాత, జిల్లాల పర్యటనలకు వెళ్లడానికి, పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలతో బేటీలు కావడానికి, జగన్ కు మరింత మేర సమయం దొరుకుతుందన్న వాదన వినిపిస్తోంది.

అంతేకాకుండా ఏ పార్టీతో సంబంధం లేని 75 వేల మంది తటస్థులకు, జగన్ ఇప్పటికే తన విజన్ ఏమిటో తెలియజేస్తూ ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు అందుకున్న వారు ఎవరైనా జగన్ను కలిసి సలహాలు, సూచనలు అందించే వీలుంది.

చూస్తుంటే ఏపీ పాలిటిక్స్ పై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు, ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement