జగన్ అనే నేను : మే 30 విజయవాడ లో !

ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే వైసీపీ ఆంధ్ర లో పోటీ లేకుండా దూసుకుపోతోంది . చెప్పాలంటే వాటిని మించి , వైసీపీ యే ఆశ్చర్యపోయేలా 150 సీట్స్ తో వైసీపీ ఒక సునామి యే సృష్టించింది . కొత్త ముఖ్యమంత్రి గా జగన్ పట్టరాని సంతోషం తో మీడియా ముఖం గా ఆంధ్రులకి కృతఙ్ఞతలు కదా చెప్పారు. ఇక మిగిలింది అధికారిక ప్రమాణమే!

అది కూడా కడప లోనో .., ముందుగా వార్తలొచ్చినట్లు తిరుపతి లోనో కాదు !! ఎక్కడి నుంచైతే రాజధాని మారుస్తాడు అని టీడీపీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసారో అక్కడి నుంచే !! విజయవాడ నుంచే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ నెల 30 న విజయవాడ లో ఈ వేడుక జరుగబోతోంది.

ఈ రోజు ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన రాజీనామా ను గవర్నర్ కు సమర్పించారు. కాబట్టి , వచ్చే వారం కొత్త ప్రభుత్వం అధికారికం గా పగ్గాలు చేపట్టబోతోంది.