అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు:వైఎస్.జగన్

గత కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ పింఛన్‌ పథకంపై ఏపీలో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు.

ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు :వైఎస్ జగన్

Jagan Promises For CPS Issues

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ‘చలో అసెంబ్లీ’ పోరాటంలో భాగంగా ఉద్యమబాట పట్టిన ప్రభుత్వ వేతనజీవులపై టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

ఆందోళనకు తరలివచ్చిన ఉద్యోగులను కర్కశంగా అరెస్టు చేసింది.దీనితో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర కలవరం రేపుతోంది.

సీపీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన నెలలోపే సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పడం ద్వారా ఉద్యోగ వర్గాలకు కొండంత అండగా నిలబడ్డారు. వైఎస్‌ జగన్‌ ప్రకటన పై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.