జగన్‌ ప్రచార సభతో జనసంద్రంగా మారిన కొయ్యలగూడెం

ఎన్నికల ప్రచారంలో భాగంగా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో బీసీలకు, యువతకు పెద్దపీట

పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్న రైతన్నలకు అధికారంలోకి రాగానే మే మాసంలో రూ.12,500 చేతుల్లో పెడ్తామని హామీ ఇస్తున్నాను. రైతుల కోసం రుణాలిప్పిస్తాం.. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీలు, టోల్‌ ట్యాక్సీలు లేకుండా చేస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంట్‌ ఇస్తాం. గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరికరణ తీసుకొస్తాం, అని వైఎస్ జగన్‌ హామీ ఇచ్చారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు చేయని జిమ్మిక్కులు ఉండవు. గ్రామాల్లోకి డబ్బులు మూటలు పంపిస్తారు.  అందుకే ప్రతి ఊరికి వెళ్లండి. ప్రతి ఒక్కరికీ చెప్పండి. చంద్రబాబుకు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి.

జగనన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్‌ రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి. పోలవరం నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెల్లం బాలరాజు, ఏలూరు ఎంపీ అభ్యర్థి  కోటగిరి శ్రీధర్‌కు  మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి.అని వైఎస్ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు