జర్నలిజం అంటే బాబు ను మోయడమేనా ? : జగన్

సత్తెనపల్లి లో జరిగిన అసెంబ్లీ న్నికల ప్రచార సభ లో వైస్సార్సీపీ అధినేత జగన్ , బాబు ను అతని అనుకూల మీడియా ను తీవ్రంగా విమర్శించారు . బాబు పాలనను , ఎల్లో మీడియా తప్పుడు కథనాలను జగనూ ఈ సభ లో దుయ్యబట్టారు.

బాబుకు అర్థమయిపోయిందా?

2014 మేనిఫెస్టో లో చెప్పిన విషయాల్లో చేయని వాటిని ఎల్లో మీడియా ఎందుకు నిలదీయడం లేదు ? ఈ రాష్ట్రము లో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక మాఫియా , మట్టి మాఫియా వీళ్ళకెందుకు కనిపించడం లేదు ? చంద్ర బాబు కు ప్రయోజనం చేకూర్చేలా వార్తలు వండి వార్చడమేనా జర్నలిజం ? లేదా వారి వారి మీడియా అధిపతుల వ్యాపారాలను వృద్హి చేయడమేనా జర్నలిజం ? అని జగన్ ప్రశ్నించారు.

అలాగే సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కోడెల ను స్పీకర్ పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తిగా జగన్ అభివర్ణించారు .