యాత్ర మూవీ పై వైఎస్.జగన్ ట్వీట్

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘యాత్ర’… శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

‘యాత్ర’ సెన్సార్ రిపోర్ట్

రాజన్న పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

మహి వీ రాఘవ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది.

ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్సార్ తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ చిత్రం పై ట్విట్టర్ లో స్పందిస్తూ… ‘యాత్ర’ సినిమాను విజయవంతంగా విడుదల చేసినందుకు చిత్రబృందానికి అభినందనలు‌.

గొప్ప నాయకుడైన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రను సినిమాలో ఎంతో నిబద్ధతతో చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ట్వీట్ చేశారు.

Advertisement