థియేటర్ కి వెళ్లే సినిమా చూస్తా:జగన్

Jagan Watch Yatra Movieఏపీలో ప్రతిపక్ష నాయకుడు,కాబోయే ముఖ్యమంత్రి అని సర్వేలు తేల్చి చెబుతున్న నాయకుడు వైయస్ జగన్.ఆయన తండ్రి దివంగత వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.ప్రస్తుతం ఏపీలో ఈ సినిమా పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

జగన్ ముందు బాబు ఎప్పుడో ఓడిపోయాడు:గట్టు

మరి ఈ సినిమా మీద జగన్ అభిప్రాయం ఏంటి, ఆయన ఈ సినిమా చూశారా, ఇవన్నీ సగటు జనానికి సందేహాలే. ఎందుకంటే జగన్ ఈ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

తాజాగా ఈ చిత్రబృందం జగన్ ని కలిశారు .సినిమా హిట్ కావడం పట్ల జగన్ హర్షం వ్యక్తం చేశారట. ఈ సినిమా చూడాలని, స్పెషల్ షొ వేస్తామని కూడా ఫిల్మ్ యూనిట్ చెప్పిందట.

దాన్ని సున్నితంగా తోసిపుచ్చిన జగన్ తానే ధియేటర్ కి వచ్చి సినిమా చూస్తానని, జనంతో సినిమా చూడడమే తనకు చాలా ఇష్టమని చెప్పారట.చూస్తుంటే రెండు మూడు రోజుల్లో జగన్ సినిమా హాల్లో వైఎస్సార్ అభిమానుల మధ్యనే ఉండి ఈ సినిమా చూస్తారని తెలుస్తోంది.

Advertisement