ఫస్ట్ లుక్: ‘సైరా’ నుండి జగ్గూభాయ్!

Jagapati Babu First Look in Sairaమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా,దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈ సినిమాను రామ్ చరణ్ కొణెదల నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు.

ఎన్టీఆర్ వల్లే అరవిందలో అవకాశం :జగపతిబాబు

బ్రిటీష్ పాలకులపై తిరగబడ్డ తొలి తెలుగు బిడ్డ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.కాగా వచ్చే విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్ ను, మోషన్ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది.

‘సైరా’లో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది.రెడ్డి రాజుగా జగపతి బాబు గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో విభిన్నంగా కనిపిస్తున్నాడు.