ఎన్టీఆర్ వల్లే అరవిందలో అవకాశం :జగపతిబాబు

జగపతిబాబు హీరో గా పరిచయమై ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆయనకు హీరో ఛాన్సులు తగ్గాక ‘లెజండ్ ‘ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా తరువాత ఆయనను వెతుక్కుంటూ విభిన్నమైన పాత్రలు వస్తూనే ఉన్నాయి.ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి ఆ పాత్రకు న్యాయం చేస్తారు.అటు తండ్రి పాత్రలోనూ,ఇటు విలన్ పాత్రలోనూ క్లాస్ గా-మాస్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఎన్టీఆర్ కు క్లాప్స్ కొడుతున్న రష్మిక 

Jagapati Babu Look in Aravinda Sametha

నిన్న విడుదల అయిన ‘అరవింద సమేత’ ట్రైలర్ లో జగ్గు భాయ్ లుక్ అదిరిపోయింది.నోట్లో బుల్లెట్టు పెట్టుకొని ముక్కుపై కత్తి గాటుతో ఎంతో కర్కశంగా కనిపించాడు.ఈ ఒక్క పిక్ చాలు జగపతి బాబు రోల్ ఎలా ఉండబోతుందో చెప్పటానికి.ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ,ఎన్టీఆర్ వల్లే ఇందులో అవకాశం వచ్చిందని చెప్పారు.ఈ పాత్రకు జగపతిబాబు గారు అయితేనే బాగుంటారు అని త్రివిక్రమ్ కు రిఫర్ చేశారు. ఇలాంటి పాత్ర లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.మీ అందరిని త్వరలో థియేటర్లో కలుస్తానని
ఆయన తన ప్రసంగాన్ని ముగించారు

Advertisement