జై సింహ మూవీ తెలుగు రివ్యూ : ‘అజ్ఞాతవాసి’ కంటే బెటరేనా???

జై సింహ మూవీ తెలుగు రివ్యూ | జై సింహ మూవీ రివ్యూ | జై సింహ రివ్యూ | జై సింహ | నందమూరి బాలకృష్ణ | నయనతార | హరి ప్రియ | నటాషా దోషి | కే ఎస్ రవి కుమార్ | సి కళ్యాణ్

Jai Simha Movie Review in English

జై సింహ మూవీ తెలుగు రివ్యూ (2.75/5.0)

బాలయ్య అంటేనే మాస్ .,! బాలయ్య అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ ..! బాలయ్య అంటేనే రోమాలు నిక్కబొడిచే యాక్షన్ ..! అలాంటి బాలకృష్ణ ని తీసుకెళ్లి అప్పుడెప్పుడో ఎస్ వి కృష్ణా రెడ్డి తీసే మావి చిగురు లాంటి ఎమోషనల్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది ? జై సింహ అలానే వుంది.

బాగా కోపమున్న హీరో., ఆ కోపం కారణం గానే ప్రేమించిన హీరోయిన్ ని త్యాగం చేస్తాడు . ఇంకో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకి తండ్రి అవుతాడు . పిల్లలు కలగని మాజీ ప్రియురాలికి ఒక బిడ్డని ఇస్తాడు .ఈ మాజీ ప్రియురారాలి భర్త ACP . ఆమేమో ., తనని ప్రేమించి మోసం చేసాడని హీరోని అసహ్యఇస్తూ ఉంటుంది.ఈ మధ్య లో ఆల్రెడీ పిల్లలున్న హీరోని ఇష్టపడే ఇంకో హీరోయిన్ ..! ఒకటేమిటి .., చాలా వున్నాయ్ జై సింహ లో ట్విస్ట్ లు .

కథ : నరసింహ (బాల కృష్ణ ) తన కొడుకుని పెంచుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి హింస పడదు. అందులో భాగంగా ., ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారుతూ వెళ్తుంటాడు .ఆ క్రమంలో ఒకసారి హోమ్ మినిస్టర్ తో గొడవ పడి ACP కి శత్రువు గా మారతాడు. కక్ష కట్టిన ACP ., నరసింహ ను ఒక కేసు లో అరెస్ట్ చేసి జైలు కి తీసుకెళ్తుండగా ., నరసింహ తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసారని వారితో గొడవకి దిగి ఆ బిడ్డ ని కాపాడతాడు.

తీరా ఆ బిడ్డ తన బిడ్డ అని ACP మరియు అతని భార్య నయనతార, నరసింహ కి కృతజ్ఞతలు చెప్తారు.

నయనతార ఎవరు? నరసింహ వారి బిడ్డ ని తన బిడ్డ అని ఎందుకు అనుకుంటాడు ? నరసింహ హింస కి ఎందుకు దూరంగా ఉంటాడు అనేది తెర మీద చూడాల్సిందే !

విశ్లేషణ : ఎన్నో సార్లు చూసిన కథ నే తీసుకున్నారు., పర్లేదు ., భరిస్తాం ! కానీ మరి అంతలా ఏడిపిస్తే ఎలా సామి…! బాలకృష్ణ లాంటి హీరో ని పెట్టుకొని త్యాగాలు., తోటకూరలు అంటే ఎవరన్నా చూస్తారా ? పోనీ., అదీ భరిస్తాం ..! ఆ సీన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో., ఆ కధ ఏంటో ., ఆ బోరింగ్ లవ్ స్టోరీ ఏమిటో., ! ఒకటి కాదు లే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష.

మొదటి సగం మంచి మలుపులతో ., అమ్మ కుట్టి లాంటి బీట్ సాంగ్ తో ఆసక్తి రేకెత్తించినా ., రెండో సగం పూర్తి గా గాడి తప్పింది. అనవసరమైన హాస్యం., ఆసక్తి కలిగించని ప్రేమ.,పెళ్లి సీన్స్ ., సాగదీసిన ఫ్లాష్ బ్యాక్ డ్రామా ., జై సింహ ని పూర్తి గా సాధారణం గా మార్చేశాయి. ఏ పి లో అర్ధరాత్రి వేసిన స్పెషల్ షోస్ లోనే సగం సేపు ఫాన్స్ కూడా నిద్ర పోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

బాలయ్య బాబు ఎప్పటి లానే ., తన ఫాన్స్ కోసం చాలా కష్ట పడ్డాడు . డైలాగ్స్ చెప్పడం లో., మంచి డాన్స్ లు చేయడం లో., సెంటిమెంట్ పండించడం లో తన పూర్తి సహకారం ఇచ్చాడు. కాకుంటే పస లేని కథ , దిశా గమనం లేని కధనం బాల కృష్ణ కి మంచి పండగ విజయాన్ని అందించలేకపోయాయి.

నయనతార బావుంది. ప్రియం జగమే ఆనందమయం పాట లో మరింత అందం గా వుంది . బరువైన సన్నివేశాల్లో మెప్పించింది . కానీ చాల సేపు ఆమె పాత్ర ఏడుపు తో నే వుంది . హరి ప్రియా బాల కృష్ణ భార్య గ కొద్దీ సేపు అమాయకమైన పాత్ర లో కనిపించింది. నటాషా అమ్మ కుట్టి పాట కోసం మాత్రమే వుంది.

ప్రకాష్ రాజ్, నయనతార తండ్రి పాత్ర లో కొద్ది సేపు మెరిశాడు. బ్రహ్మానందం మరియు మిగతా కమెడియన్స్ కాసేపు పాత తరహా కామెడీ తో విసుగు తెప్పించారు.

డైరెక్టర్ రవి కుమార్ కి ఏ మాత్రం బాల కృష్ణ బలం తెలిసున్నా ఇలాంటి సినిమా తీసుండేవాడు కాదు. ఎదో సంబంధం లేని కథ లో బాలయ్య ను ఇరికించాడు. ఇరికిస్తే పర్లేదు ., ఆ ఇరుకు లో భరించలేని కథనం., పాటలు,ఫైట్స్ పెట్టి ఆ ప్రయాణాన్ని మరింత దుర్భరం చేశాడు. ఇంకే తెలుగు హీరో రవి కుమార్ తో సినిమా చేయాలంటే భయమేసేలా జై సింహ ని తీర్చి దిద్దాడు.

చిరంతన్ భట్ నేపధ్య సంగీతం అలరించింది . ముఖ్యం గా అమ్మ కుట్టి మరియు ప్రియం పాట ల్లో అతని పని బావుంది. రామ్ ప్రసాద్ ఛాయా గ్రహణం పర్లేదు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ అసలు బాలేదు. సెకండ్ హాఫ్ లో చాల భాగం కత్తెర వేయాల్సిన పని వుంది. సి కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగానే వున్నాయి. కొన్ని పాటల్లో బాగా ఖర్చు పెట్టారు.

చివరి మాట : మొత్తానికి జై సింహ కూడా., పూర్తి సంక్రాంతి సినిమా లా లేదు., కొంత వరకే సంతృప్తినిస్తుంది. పండగ రోజు ఫ్యామిలీ తో కలిసి చూడటానికి బాగానే ఉంటుంది కానీ ., ఎక్కువ ఆశించి మాత్రం వెళ్లొద్దు.

ఒక్క ముక్క లో : ‘అజ్ఞాతవాసి’ కంటే బెటరేనా???

Advertisement