అన్ని స్థానాలలో పోటీకి సిద్ధపడుతున్న పవన్

ఏపీలో పార్టీ బలోపేతం పై ఇప్పటి వరకు ద్రుష్టి పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పినట్టే తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు.

ప్రచార రథాలను ప్రారంభించిన పవన్

లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణకు ఎక్కువ సమయం వెచ్చించనున్నారు.ఈ నేపధ్యం లో భాగంగానే జనసేనాని పార్లమెంటరీ కమీటిలని సిద్దం చేశారు.

మొదట ఖమ్మం, సికింద్రాబాద్, మల్కాజగిరి స్థానాలకు కమీటీల్ని సెలెక్ట్ చేసిన ఆయన ఆ తర్వాత నల్గొండ, భువనగిరి, వరంగల్, మెదక్ స్థానాలకు మూడో విడతలో నిజామాబాద్, చేవెళ్ల, మహబుబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్ స్థానాలకు చివరి విడతలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ స్థానాలకు కమిటీలు ఫైనల్ చేశారు.

పవన్ అప్పుడు చెప్పాడు కాబట్టి నామ్ కె వాస్తే కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతున్నాడని చెప్పారు.కానీ ని తీరు చూస్తే మొత్తం అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తుంది.