ఈ సారి టీడీపీ కొంపముంచిన జనసేన!

2014 లో టీడీపీ కి మద్దతు పలికి పవన్ , తాను ఒక బలమైన ప్రభుత్వం వచ్చేలా చేసింది. మోడీ ప్రభావం కూడా పని చేసినా , ఎక్కువ పవన్ తెచ్చిన మద్దతే టీడీపీ ని అధికారం వైపు వెళ్లేలా చేసింది. కానీ అదే జనసేన ఈ సారి ఒంటరిగ్గా పోటీ చేసి గణనీయం గా టీడీపీ వోట్ బ్యాంకు కి చీల్చేసింది.

ఫలితం గా వైసీపీ కనీ వినీ ఎరుగని మెజారిటీ తో ఆంధ్ర లో అధికారాన్ని దక్కించుకుంది . ఇది ఎవరు అంగీకరించినా , అంగీకరించకున్నా సత్యం !! ఈ చీలిక అటు టీడీపీ కి ,ఇటు జనసేన కు చేటు చేసింది . ఒకవేలపవాన్ 2014 లో ఒంటరిగా వచ్చి ఉంటే , ఒక సంకీర్ణం వచ్చే అవకాశం కచ్చితం గా ఉండేది అని అర్ధమవుతుంది . ఆలా సంకీర్ణం వచ్చినా పవన్ ఆశించిన పాలన కొంతైనా సాధ్యమయ్యేదేమో !!

Pawan Chandrababu Meetings

ఏదేమైనా నేతల ఆలోచనలు , కదలికలు ఏపీ లో సంకీర్ణం వచ్చే పరిస్థితే లేదు అని చెప్తోంది. కాకుంటే పవన్ గెలుస్తాడు కచ్చితం గా అనుకున్నగాజువాక కూడా ఆయనకు దక్కకపోవడం ఆశ్చర్యం గొలిపే విషయం !