జేడీ లక్ష్మినారాయణ రంగు బయటపడిందా?

JD Lakshminarayana Joins in TDPమాజీ సిబిఐ జేడీ లక్ష్మినారాయణ తాను సిబిఐగా ఉన్నప్పుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కేసుల్ని దర్యాప్తు చేశారు.ఆ తరువాత ఆయన ప్రభుత్వ సర్వీస్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు.అప్పట్లో జేడీకి ,టీడీపీ మధ్య సంబంధం ఉందని చాలాసార్లు వార్తలు వచ్చాయి.

వైసీపీ వైపు చూస్తున్న వంగవీటి రాధ!

కానీ జేడీ మాత్రం ఆవార్తలను ఖండిస్తూ,తానేదో సొంత పార్టీ పెడతానని,రాజకీయాలు మారుస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన రాష్ట్రమంతా పర్యటించి చాలా పరిశోధన కూడా చేసినట్టు చెప్పుకున్నారు. కానీ చివరకు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యాయి.

ఈరోజు ప్రముఖ దిన పత్రిక ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం, ఆయన టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీచేయవచ్చని ,మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో భేటీ అయ్యారని,త్వరలోనే జేడీ చంద్రబాబుతో భేటీ కానున్నారని ఆ కధనంలో వెల్లడించింది.