రేపే నాని ‘జెర్సీ’ టీజర్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా ‘ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’.

వినాయక్ కి ఓకే చెప్పిన వెంకీ

ఇక ఈ చిత్రంలో నాని మొదటి సారిగా క్రికెటర్ గా కనిపించబోతున్నాడు.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క టీజర్ సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12) విడుదల చేయనున్నారు.

క్రికెట్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకున్నారు.

రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈఏడాది ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.