‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రంలో సుప్రీమ్ హీరో సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

‘సైరా’ లో స్టైలిష్ స్టార్ ?

తాజాగా ఈ చిత్రం ఏప్రిల్12 న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్స్ , ప్రోమోస్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా ఈ చిత్ర ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడని సమాచారం.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగారాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.కొంతకాలంగా హిట్స్ లేక బాధపడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.అతి త్వరలోనే ఈ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.