కార్తీ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న జ్యోతిక

తమిళ్ లో పాపనాశనమ్(దృశ్యం) ఫేమ్ జీతూ జోసఫ్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఓ సినిమా రూపొందనుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.అయితే తాజా సమాచారం ప్రకారం క ఈ చిత్రంలో కార్తి వదిన నటి జ్యోతిక ఒక ముఖ్య పాత్రలో నటించనుంది.

తండ్రి పాత్రలో ‘అర్జున్‌ రెడ్డి’

ఫిల్మ్‌ మేకర్‌ జీతూ జోసఫ్‌ ఓ ఎగై్జటింగ్‌ స్క్రిప్ట్‌తో రావడం, జ్యోతిక, కార్తీలకు ఈ కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని కోలీవుడ్‌ టాక్‌. లాజిక్‌ మిస్సవకుండా సినిమాలు తీస్తాడనే పేరు జీతూకి ఉంది. జ్యోతిక, కార్తీల కోసం అలాంటి సినిమానే ప్లాన్‌ చేశారట.

ఈ ఫ్యామిలీ డ్రామాలో జ్యోతిక పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట.ఇది ఇలా ఉండగా ‘స్క్రిప్ట్‌ దొరికితే కచ్చితంగా మా ఫ్యామిలీలో ఎవ్వరమైనా కలిసి స్క్రీన్‌ మీద కనిపిస్తాం’ అని చాలా సందర్భాల్లో పేర్కొంది
సూర్య ఫ్యామిలీ. ఇక కార్తి ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఖైదీ చిత్రంలో నటిస్తున్నాడు.