కడపలో టీడీపీకి గుండు సున్నా..

Kadapa TDP Seatsవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో టీడీపీ జీరోగా మారిపోయిందని చెప్పక తప్పదు. కడప జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,ఆయన కూడా నిన్నలాంఛనంగా వైసీపీలోకి చేరిపోయారు.

100 మంది వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ!

గత ఎన్నికలలో కడప జిల్లా ఫలితాలను చూస్తే, మొత్తం పది అసెంబ్లీ సీట్లకు 9 స్ధానాలను గెలిచేసిన వైసీపీ, రెండు పార్లమెంటు సీట్లలోనూ జయకేతనం ఎగురవేసింది.కాగా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా, వైసీపీ అభ్యర్థి అమర్ నాథరెడ్డిపై 11615 ఓట్ల మెజారిటీతో గెలిచారు.దీంతో టీడీపీకి సింగిల్ సీటు మాత్రమే లభించింది.

వైసీపీలో చేరాలంటే ఇతర పార్టీల టికెట్లపై అందిన పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని చెప్పిన జగన్ మాటకు మేడా కట్టుబడి ,ఆ మేరకు తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసేశారు. ఆ తర్వాత నేరుగా జగన్ వద్దకు వెళ్లిన మేడా వైసీపీలోకి చేరిపోయారు.

మొత్తంగా ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో దక్కిన ఒక్క సీటు కూడా రాజీనామాగా నిలవడంతో కడప జిల్లాలో టీడీపీ జీరోగానే మారిందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Advertisement