కాజల్,తమన్నా హొయలు ఇంకెన్నేళ్లో !

15 ఏళ్లుగా తెలుగు ,తమిళ చిత్ర సీమల్లో గ్లామర్ కి పర్యాయపదంగా ఉన్నా ఈ ముద్దు గుమ్మలు ఇంకా అడపా దడపా రెచ్చిపోతూనే ఉన్నారు . వారి సమకాలీకులైన అనుష్క ,నయనతార ,సమంత లు చిన్నగా హీరోయిన్ ప్రాధాన్య మున్న సినిమాల వైపు మొగ్గు చూపినా కాజల్ ,తమన్నా మాత్రం అందాన్నే నమ్ముకున్నారు.

మొన్నటి మొన్న ఎఫ్ 2 లో తమన్నా మందేసి చిందేసింది. మళ్ళీ ప్రభుదేవా సీక్వెల్ “అభినేత్రి 2” లో కూడా అమ్మడు ఎక్కడా తగ్గట్లేదు.

Tamannah in abhinetri 2

ఇక అందాల చందమామ కాజల్ “సీత ” అనే సాంప్రదాయ టైటిల్ తో వస్తున్నా ., సమాంతరం గా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో పోటీ లో నేను ఉన్నాను అంటోంది.ఇక త్వరలో క్వీన్ రీమేక్ లో కూడా వీరిద్దరూ కనిపించబోతున్నారు

kajal hot photoshoot

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో !! ఎలా అయినా వ్యాపార కుటుంబాల నేపథ్యం ఉంది కదా !!అదీ కాక ఇంకో రెండు మూడేళ్లకంటే ఎక్కువ టైం కూడా లేదు . అందుకే తెలివిగా మార్కెట్ ఉండగానే వెనకేస్తున్నారు ఈ అమ్మాయిలు !