కల్కి టీజర్ :’యాంగ్రీ యంగ్ మ్యాన్’ కాస్త ‘యాంగ్రీ స్టార్’

గరుడవేగ చిత్రం యొక్క హిట్‌ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి మంచి జోష్‌ తో ఉన్నాడు హీరో రాజశేఖర్‌.ఈ హీరోకు సరైన టైమ్‌లో సరైన సినిమా పడి అంచనాలకు మించి ఆడటంతో రాజశేఖర్‌ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొంది.

హరీష్ శంకర్ కొత్త చిత్ర టైటిల్Kalki Teaser Out అదే జోష్ లో తన తదుపరి చిత్రం ‘కల్కి’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే కల్కి చిత్రానికి సంబంధించి రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

అలాగే ఈ టీజర్ లో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ కాస్త ‘యాంగ్రీ స్టార్’ గా రాజశేఖర్‌ అదరగొట్టేస్తున్నాడు.
ఇక ఈ టీజర్ ను చూస్తుంటే మరోసారి రాజశేఖర్ లోని ఫైర్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరపై ఆవిష్కరించనున్నారని తెలుస్తుంది.

1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందితా శ్వేతా, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

క్రైమ్‌ బ్యాగ్రౌండ్‌లో రానున్న ఈ చిత్రం కోసం రెండు కోట్లతో హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు. సికె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి కళ్యాణ్, రాజశేఖర్ కూతుర్లు శివాని-శివాత్మిక బ్యానర్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.