వైసీపీలోకి ఆమె రావడంతో..,లోకేష్ పక్కా ఇంటికే!

Kandru Kamala Against to Lokeshచంద్రబాబు చాలా సర్వేలు చేయించుకున్న తర్వాతే, మంగళగిరి సేఫ్ అని లోకేష్ ని బరిలోకి దింపారు.మంగళగిరి సేఫ్ అని చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి.

రాజధాని ప్రాంతంలో జగన్ హవా చూశారా?

ఈమధ్యే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరారు.అలాగే గంజి చిరంజీవికి కూడా మంగళగిరిలో మంచి పట్టుంది.అంతేకాదు వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

వీళ్లంతా లోకేష్ కోసం పనిచేస్తే వారి సామాజిక ఓట్లన్నీ లోకేష్ కే పడతాయి కాబట్టి, మిగిలిన ఓట్లు ఎలాగూ టీడీపీకే పడతాయి అనే ఉద్ధేశంతో చంద్రబాబు మంగళగిరిని ఎంచుకున్నారు.

నిజానికి కాండ్రు కమల టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ్యవచ్చు అని పార్టీ మారింది.కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.దీంతో ఎలాగైనా సరే లోకేష్ ని ఓడించాలి అనుకున్న కాండ్రు కమల, డైరెక్ట్ గా జగన్ దగ్గరకు వెళ్లి వైసీపీలో జాయిన్ అయిపోయారు.

ఇప్పుడు చంద్రబాబు అంచనాలు అన్నీ తారుమరయ్యాయి. కాండ్రు కమల వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఓట్లు చీలిపోతాయి. చేనేత కార్మికుల ఓట్లు చీలితే అంతిమంగా అది వైసీపీకి ప్లస్ అవుతుంది. ఇప్పటికే మంగళగిరిలో ఎదురీదుతున్న లోకేశ్‌కు మరింత గడ్డు పరిస్థితి తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.