పోలవరం ప్రాజెక్టుకు బాబు గుత్తేదారా:కన్నా

Kanna Comments on Chandrababuటీడీపీ బీజేపీతో పొత్తు వీడాక ప్రధాని మోదీపై బాబు నిప్పులు చెరగడం మొదలుపెట్టాడు.ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని నట్టేట ముంచాడని మోదీని విలన్ లా ఏపీ ప్రజలకు చూపిస్తున్నాడు.

ప్రజల ఆరోగ్యానికి నాది భరోసా:జగన్

దీంతో బీజేపీ నేతలు బాబును టార్గెట్ చేశారు.వారిలో ముఖ్యులు కన్నా లక్ష్మిన్నారాయణ.ఆయన ట్విట్టర్ వేదికగా బాబుపై మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టులో మీరు బ్రోకర్లా – కాంట్రాక్టర్లా అంటూ పరుష పదజాలంతో విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా కేవలం 24 గంట్లలో 32 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రిట్ వేయడం ద్వారా, రెండు గిన్నిస్ బుక్ రికార్డులు ఏపీ ప్రభుత్వానికి సొంతమయ్యాయి.

ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు అధికారులు కాంట్రాక్టర్లతో పాటు చంద్రబాబు కష్టపడ్డారు. రికార్డులు నెలకొల్పిన తర్వాత అక్కడే పైలాన్ ఆవిష్కరించారు. అసలు చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా లేదా పోలవరం ప్రాజెక్టుకు గుత్తేదారా అంటూ కన్నా విమర్శించారు.

Advertisement