కార్తీ-రకుల్ “దేవ్” మూవీ ఫస్ట్ లుక్!

karthi Dev First Look

తమిళ్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. అలాగే తన సినిమాలు తెలుగు లో కూడా ఆడేలా ప్లాన్ చేసుకుంటాడీ హీరో. కార్తీ -రకుల్ ఇంతకు ముందు ‘ఖాకీ’ సినిమా తో అలరించిన సంగతి తెలిసిందే !ఇప్పుడు ఈ జంట “దేవ్ ” అంటూ ఇంకో సినిమా తో వస్తున్నారు. వీరిద్దరి తో పాటు ప్రకాష్ రాజ్ -రమ్య కృష్ణ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.

కొత్త ట్రెండ్ – అరవింద సమేత బీజీఎమ్స్ అన్నీ ఒక ఆల్బం లా!

రచయత రజత్ రవిశంకర్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హారిస్ మ్యూజిక్ అందిస్తున్నారు. సింగం 2 తీసిన ప్రిన్స్ పిక్చర్స్ రిలయన్స్ వారి సహకారం తో దేవ్ ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా కి మంచి బిజినెస్ జరుగుతుంది. స్టైలిష్ లుక్స్ ,మోడరన్ బైక్ సెటప్ తో ఈ మూవీ నేటి తరానికి బాగా నచ్చేలాంటి స్టోరీ తో వస్తున్నట్లు సమాచారం.

Advertisement