యాక్షన్ థ్రిల్లర్ గా కార్తి కొత్త చిత్రం!

ఖాకి,చినబాబు చిత్రాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్ లో వున్నాడు హీరో కార్తి.ప్రస్తుతం కార్తి ‘దేవ్’ అనే అడ్వెంచరస్ చిత్రంలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

300 కోట్ల భారీ బడ్జెట్ తో విక్రమ్ సినిమా!

త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.కార్తి ఈ చిత్రం తరువాత ‘మానగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం లో నటించనున్నాడని సమాచారం.అయితే ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందట.

డ్రీం వారియార్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించనున్నాడు.ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement