కేసీఆర్ ఢిల్లీ టూర్ అందుకేనా?

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఢిల్లీ వెళ్లారు.కాని ఎందుకు వెళ్లారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ మోడీని కలవడానికి వెళ్లారని,అది కూడా చంద్రబాబు ఓటుకునోటు కేసును తెర పైకి తీసుకు రావడానికని తెలుస్తుంది.

గవర్నర్ ని కలిసిన కేసీఆర్?

KCR Delhi Tour

ఢిల్లీ పర్యటన తరువాత కేసీఆర్ డైరెక్ట్ గా గవర్నర్ ను కలిశారు.ఆ భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగడం చర్చనీయాంశంగా మారింది.ఆ భేటీ కూడా ఓటుకునోటు కేసులో బాబును అరెస్ట్ చేస్తే,రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని,రానున్న ఎన్నికలకు తనకేమైనా నష్టం కలుగుతుందా?అన్ని కోణాల్లో సుదీర్ఘంగా అలోచించి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

అటు మోడీ సర్కార్ ,కేసీఆర్ ఇలా చేయడానికి కారణం కూడా ఉంది లెండి,బాబు ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకొని,ఇప్పుడు విడిపోయి మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు.అది సరిపోదు అన్నట్టు కాంగ్రెస్ తో కలిసాడు.ఇక కేసీఆర్ ని ఓడించడానికి బాబు మహాకూటమిలో భాగం అవడంతో ,కేసీఆర్ కి కూడా బాబు టార్గెట్ అయ్యాడు.రానున్నది చంద్రబాబుకి గడ్డుకాలంగా మారనుందా? అంటే అవుననే తెలుస్తుంది.