మళ్లీ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రానున్న ‘మహానటి’

‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.ఈ భామ మొదటి చిత్రంతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడం తో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి.

#RRR లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్

ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనేంతలా నటించి తెలుగు వారి మనసులు గెలుచుకుంది.

అయితే తాజాగా కీర్తి సురేష్ ఓ లేడి ఓరియంటెడ్ కథ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో ఈ భామ నటిస్తుందని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాకి నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement