‘కేజిఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ప్రారంభం!

KGF Chapter 2 Shooting Startయష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కేజిఎఫ్ చాప్టర్ 1’. ఈ సినిమా కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.దీంతో ఈ సినిమా పార్ట్ 2ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

‘మజిలీ’ ప్రీరిలీజ్ బిజినెస్..

మొదటి భాగం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 250 కోట్ల దాకా వసూళ్లు సాధించింది. ఇదిలాఉంటే ఇప్పుడు రెండవ భాగంను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఈరోజు బెంగళూరు కంఠీరవ స్టూడియోలో లాంచనంగా మొదలైన ఈ సినిమా 2020 సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

చెప్పాలంటే ఈ సినిమా తరువాత యశ్ కు టాలీవుడ్ ,బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌ లు కేజీయఫ్‌ 2లో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.