కేజీఎఫ్ మూవీ రివ్యూ:అంచనాలకు మధ్యలో

KGF Movie Review

కేజీఎఫ్ మూవీ రివ్యూ రేటింగ్: 2.5/5.0

కన్నడ హీరోపై రాజమౌళి ఆసక్తి!

కేజీఎఫ్ మూవీ రివ్యూ:మాస్ ఎలిమెంట్స్ తో అదరగొట్టిన యాష్

నటీనటులు – యష్-శ్రీనిధి శెట్టి-అనంత్ నాగ్-అచ్యుత్ కుమార్-మాళవిక అవినాష్

సంగీతం – రవి బస్నూర్-తనిష్క్ బాగ్చి

ఛాయాగ్రహణం – భువన్ గౌడ

ఎడిటింగ్ – శ్రీకాంత్

ఆర్ట్ డైరెక్టర్ : శివకుమార్

నిర్మాణం : వారాహి – హోంబాలె

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం – ప్రశాంత్ నీల్

గత కొన్ని రోజులుగా ‘కేజీఎఫ్’ సినిమా అన్ని ఇండస్ట్రీ నోళ్లల్లో నానుతుంది.ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్ విడుదలైందో అప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.కన్నడలో తొలి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం.కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది.విపరీతమైన పోటీ మధ్య విడుదలయిన కేజీఎఫ్ తెలుగు ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దామా!

కథ :

పుట్టేటప్పుడు ఎలా పుట్టినా చచ్చేటప్పుడు ధనవంతుడిగా చావాలని,(యాష్ ) రామకృష్ణ తల్లి చెప్పిన మాటలను నరనరాల్లో జీర్ణించుకుంటాడు.ముంబై వీధుల్లో రామకృష్ణ ప్రయాణం మొదలవుతుంది.ఆ తరువాత అతనికి డాన్ గా చెలామణి అవుతున్న శెట్టి పరిచయమవుతాడు.అతని సహకారంతో రామకృష్ణ ముంబై స్మగ్లింగ్ గ్రూపులో చేరతాడు.అలా దొంగ బంగారం రవాణా చేయడంలో దిట్టగా మారతాడు.రామకృష్ణ కాస్తా రాకీగా మారతాడు.ఇంకా ఎదగాలన్న రాకీ కన్ను,కోలార్ లో ఉన్న నరాచి మైనింగ్ కార్పొరేషన్ ని గుప్పెట్లో పెట్టుకున్న గరుడ(రామచంద్ర రాజు) పై పడింది.అతన్ని చంపితే ఆ సామ్రాజ్యానికి తానే రాజు అవ్వచ్చు అనుకుంటాడు.ఆ పని మీద బెంగుళూరు వస్తాడు.రాగానే బానిసగా కోలార్ బంగారు గనుల్లో బానిసగా చేరతాడు.అక్కడ రామచంద్ర రాజు కూతురు నీనా (శ్రీనిధి శెట్టి) చూసి ప్రేమలో పడతాడు.చివరికి రాకీ ఆ సామ్రాజానికి చక్రవర్తి అయ్యాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

యాష్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కినట్టే,గుబురు గెడ్డంతో విభిన్నంగా కనిపిస్తూ,సీరియస్ గా సినిమానంతా తన భుజాలపై వేసుకొని నడిపించాడు.క్రిష్ తన పాత్రకు నూరుపాళ్లు న్యాయం చేశాడు.ఇక హీరోయిన్ నిధి శెట్టికి ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేదు.ఆమె లుక్స్ కూడా పేలాగా ఉన్నాయనిపిస్తోంది.ఇక ప్రతినాయకుడు పాత్రలో కనిపించిన రామ చంద్రరాజు కర్కశత్వాన్ని బాగానే చూపించాడు.ఇక అయ్యప్ప శర్మ తన ఉనికిని చాటుకున్నాడు.మిగిలిన నటులు అవసరానికి తగ్గట్టు తమ పాత్రలలో నటించారు.

విశ్లేషణ:

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంచుకున్న కథ బాగానే ఉంది.మొదటి భాగం మొత్తం యాష్ ని హైలెట్ చేస్తూ చూపించారు.కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చూపించి ఉంటే బాగుండేది.నిజానికి మాఫియా సినిమాలు చాలానే చూశాము,కానీ కేజీఎఫ్ సినిమా ఇందుకు భిన్నంగా ఉంది.బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథనం ఇంకా బలంగా ఉంటే బాగుండేదనిపించింది.కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదల చేసి ,సినిమా కథ అసంపూర్ణంగానే ముగించారు.ఇక చాప్టర్ 2 లో కథనం ఇంకా బలంగా ఉండేలా చూసుకోవాలి.భువన గౌడ ఛాయాగ్రహణం గొప్పగా ఉంది.ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ కోలార్ సెటప్ ని తీర్చిదిద్దిన తీరు తప్పక అభినందించాల్సిందే.నిర్మాత హోంబాలే నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి.