వైసీపీ లోకి మరో సీనియర్ కాంగ్రెస్ నేత?

Kishore Chandra Dev Joins in YSRCPసుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ తో అనుబంధం కలిగిన నాయకుడు హస్తం పార్టీని వీడిపోనున్నాడట.ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద నాయకునిగా ఉన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పార్టీని వీడనున్నారట.

రిపబ్లిక్ సర్వే:ఏపీలో పైచేయి ఎవరిది?

ఇందిరా గాంధీ నుంచి ఆ కుటుంబానికి సన్నిహితుడైన వైరిచర్ల ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం గమనార్హమే. కేంద్ర మంత్రిగా పని చేస్తూ ఆయన పార్టీ కోసం ఎంతో క్రుషి చేశారు.అంతేకాదు ఏపీ విభజన వద్దు అని చెప్పిన వారిలో ఆయన కూడా ఒకరు.

ఈ అయిదేళ్ళలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందేమో, మార్పు వస్తుందేమో అని ఎదురుచూసిన ఆయనకు, ఆ పార్టీ పోకడలు నిరాశనే కలిగించాయని అంటున్నారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ ఏపీలో వద్దనుకోవడం రెండూ ఆ పార్టీ ఇష్టారాజ్యంగా చేసింది.దాని ఫలితమే కోట్ల, వైరిచర్ల లాంటి సీనియర్  నేతలు పార్టీని వీడేందుకు రెడీ కావడం అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన అరకు ఎంపీగా మరో మారు పోటీకి రెడీ అవుతున్నాడట.దీంతో ఆయన వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.అన్నీ కుదిరితే వైరిచర్ల వైసీపీ తీర్ధం పుచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Advertisement