చంద్రబాబు టైం అయిపోయింది:కొడాలి నాని

Kodali Nani Comments on Chandrababuవైసీపీ నేత కొడాలి నాని మాట్లాడుతూ,చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఎవడు లేడని ఆనాడు ఎన్టీఆరే అన్నారని,ప్రజల దగ్గర 6 లక్షల కోట్లు కొట్టేసి,ఆ డబ్బును రానున్న ఎన్నికలకు వినియోగించనున్నాడని అన్నారు.

ప్రజా నాయకుడు ఎవరు?

అసలు పరిపాలన చేతకాని అసమర్ధ నాయకుడు ,పెద్ద సైకో అంటే చంద్రబాబు నాయుడని,నోటికొచ్చినట్టు టీడీపీ అండ్ కో మాట్లాడితే ఊరుకోడానికి మేము చేతకాని దద్దమ్మలం కాదన్నారు.

వైయస్ జగన్ ను విమర్శించే హక్కు టీడీపీ కి లేదని,దోచుకోవడం – దాచుకోవడంలో టీడీపీ ముందంజలో ఉందని,రాష్ట్ర ప్రజలను ఈ ప్రభుత్వం నిలువునా దోచుకుందని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజాసంకల్ప యాత్రకు భారీగా స్పందన వచ్చిందని,రాజన్న రాజ్యం రావాలంటే జగన్ వల్లే అవుతుందని,రానున్న ఎన్నికలలో ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారని ఆయన వెల్లడించారు.

Advertisement